
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి: బ.తదియ రా.1.11 వరకు తదుపరి చవితి, నక్షత్రం: శ్రవణం ఉ.7.45 వరకు తదుపరి ధనిష్ఠ,వర్జ్యం: ప.11.44 నుండి 1.20 వరకు, దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.42 వరకు, అమృత ఘడియలు: రా.9.20 నుండి 10.55 వరకు.
సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం...కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం...రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.
మిథునం....దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు గందరగోళం. దైవదర్శనాలు.
కర్కాటకం...పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం..పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కన్య....ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
తుల....వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు పనిభారం. వ్యాపారాలు మందగిస్తాయి. సోదరుల కలయిక.
వ్చశ్చికం....పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు...కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
మకరం....పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు లాభిస్తాయి.
కుంభం...ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
మీనం..ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు పుంజుకుంటాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు.