
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.చవితి రా.11.56 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.39 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: ప.2.42 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: రా.12.05 నుండి 1.40 వరకు, సంకటహర చతుర్ధి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.35.
మేషం.... ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. అందర్నీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.
వృషభం... చేపట్టిన పనులు మరింత వేగంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.
మిథునం... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బ«ంధువులతో విరోధాలు. అరోగ్య సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం.. శ్రమ మరింత పెరుగుతుంది. ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ధనవ్యయం. సోదరులు, మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
సింహం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుగడిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు మరింత సానుకూలం.
కన్య... రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుండి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
తుల... రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృశ్చికం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సోదరులతో వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
ధనుస్సు.... బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.
మకరం... రుణదాతల నుండి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధు, మిత్రుల నుండి సమస్యలు. పనులు ముందుకు సాగని పరిస్థితి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం.... శుభవార్తలు వింటారు. ధనలాభం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు హుషారుగా నిర్వహిస్తారు..
మీనం.. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విరోధాలు. కొత్త బాధ్యతలు మోస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.