గ్రహం అనుగ్రహం (13-10-2019)

Daily Horoscope in Telugu (13-10-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరందక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి పౌర్ణమి రా.1.51 వరకు, తదుపరి బ.పాడ్యమినక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.8.04 వరకుతదుపరి రేవతి, వర్జ్యం రా.9.14 నుంచి 11.01 వరకు, దుర్ముహూర్తం సా.4.01నుంచి 4.51 వరకుఅమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  5.55
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో తొందరపాటు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం:  కొత్త విషయాలు తెలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: కొన్ని సమస్యలు తీరతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కుంభం: వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మీనం: విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top