
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు.
కాగా టీటీడీ బోర్డు చైర‍్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.