ఉపరాష్ట్రపతికి విజయసాయి రెడ్డి అభినందనలు | YSRCP MP Vijayasai Reddy congratulate Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతికి విజయసాయి రెడ్డి అభినందనలు

Published Fri, Aug 11 2017 2:09 PM | Last Updated on Thu, May 24 2018 2:18 PM

ఉపరాష్ట్రపతికి విజయసాయి రెడ్డి అభినందనలు - Sakshi

ఉపరాష్ట్రపతికి విజయసాయి రెడ్డి అభినందనలు

13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.

న్యూఢిల్లీ: 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ఉద్దేశిస్తూ శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా మీరు చేసిన ప్రసంగాలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీ పోరాటం అభినందనీయమని ప్రశంసించారు.
 
ఎమ్మెల్యేగా మీరు చూపిన పాత్ర చారిత్రాత్మకమని, అసెంబ్లీ టైగర్‌ గా పిలిచేవారని, మీ రాజకీయ ప్రయాణంలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారని కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్‌సీసీ అధ్యక్షుడు జగనమోహన్‌ రెడ్డి, పార్టీ తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement