రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
కడప : రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాయలసీమ అంటే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ కేసులో పెరుగుతున్నాయని, అధికారులు డెంగీ నివారణకు దృష్టి పెట్టాలని సూచించారు.