శ్రీనివాసరావు కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పరామర్శ | ysrcp mla alla ramakrishnareddy Called on kidnapped srinivasarao family | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావు కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పరామర్శ

Dec 3 2014 10:58 AM | Updated on Aug 24 2018 2:36 PM

నైజీరియాలో కిడ్నాపఐన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు.

గుంటూరు : నైజీరియాలో కిడ్నాపఐన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. నైజీరియా ఎంబసీ అధికారులు, తెలుగు అసోసియేషన్తో ఆయన ..ఫోన్లో మాట్లాడారు. శ్రీనివాసరావును విడిపించేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

 గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నైజీరియా దేశంలో కిడ్నాప్ అయ్యాడు. అతని స్నేహితుల మంగళవారం శ్రీనివాసరావు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంతవరకూ అతని ఆచూకీ తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement