ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు


దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి సందర్బంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఇరు రాష్ట్రాలలోని ఆ మహానేత విగ్రహాలకు పాలభిషేకం చేసి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్బంగా కొనియాడారు. అలాగే రాష్ట్రాలలోని వివిధ ఆసుపత్రుల్లో రోగులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పళ్లు పంచిపెట్టారు. వివిధ జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని వివిధ జిల్లాల వార్తలు...


 


హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పంజాగుట్ట సర్కిల్లోని దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ చీఫ్లు రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు ఘనంగా నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. నిజాంపేట చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి కుత్బుల్లాపూర్ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కొలను శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ సముదాయంలో వైఎస్ఆర్ విగ్రహానికి కాలనీ వాసులు పూలమాలు వేసి నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీలో వైఎస్ఆర్ చిత్రపటానికి వైఎస్ఆర్ కేంద్రపాలక మండలి సభ్యుడు జి.సురేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.


 


వైఎస్ఆర్ కడప జిల్లా : కడప నగరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు వైఎస్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాలు అర్పించారు. జిల్లాలోని రాజంపేటలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.


 


అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మహానేత విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ శివశంకర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి, తోపుదర్ది భాస్కరరెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి, శంకర్ నారాయణలు పూలమాలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. మహానేత రాష్ట్రానికి చేసిన సేవలను ఈ సందర్బంగా వారు కొనియాడారు. రాయదుర్గంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించారు.


 


కర్నూలు జిల్లా: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఘనం జరిగాయి. ఆళ్లగడ్డలో వైఎస్ విగ్రహానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉషారాణి, వైఎస్ ఛైర్మన్ డా. రామలింగారెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం మహానేతకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నందికొట్కూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 


చిత్తూరు జిల్లా : నారాయణవనం మండలం కేంద్రంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి సత్యవేడు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఆదిమూలం క్షీరాభిషేకం చేశారు. అనంతరం వైఎస్కు ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి నగరంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనం జరిగాయి. నగరంలోని వైఎస్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేసి పండ్లు పంచిపెట్టారు.


 


తూర్పుగోదావరి జిల్లా: పిఠాపురంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సామర్లకోటలో వైఎస్ విగ్రహానికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవాల లక్ష్మీనారాయణ, జి.దొరబాబు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూలమాలు వేసి వైఎస్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి నగరంలోని కోటగుమ్మం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో వైఎస్ఆర్ జయంతి సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పర్సుల సుబ్బారావు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. బాలాజీ చెరువు సెంటర్లో వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్, నగర మహిళ అధ్యక్షురాలు పసుపులేటి విజయలక్ష్మి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.









 


 


పశ్చిమ గోదావరి జిల్లా : చింతలపూడి మండలం ప్రగడవరంలో మహానేత వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేత విగ్రహానికి వైఎస్‌ఆర్‌సీపీ నేత రమేష్ ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి పురస్కరించుకుని ఈ రోజు మధ్యాహ్నం 5 వేల మందికి అన్నదానం చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.


జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయా ప్రాంతాలలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రులలో రోగులకు పాలు, పండ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పంపిణీ చేశారు.


పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టారు.




భీమవరం గనుపూడిలో వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాలభిషేకం చేశారు. అనంతరం పేదలకు చీరలు, పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు.


 


తణుకులో వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య క్షీరాభిషేకం చేశారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


 


కృష్ణాజిల్లా: జిల్లాలో మహానేత వైఎస్ఆర్ 65వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పామర్రులో స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు అన్నదనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలు విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ చిత్రపటానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావులతోపాటు ఆ పార్టీ నేతలు పార్థసారధి, వంగవీటి రాధ, గౌతంరెడ్డి, నాగిరెడ్డిలు ఘనంగా నివాళులర్పించారు. గుడివాడలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ పట్టణంలో పలు ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.

 


 


గుంటూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనం జరిగాయి. స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిడుగురాళ్లలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.


 


గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మైనార్టీ నేత చాంద్ బాషాలు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కొరిటిపాడులో వైఎస్ఆర్ చిత్రపటానికి విద్యార్థి సంఘం నేతలు ఘనంగా నివాళులర్పించారు. చుట్టుగుంటలో వైఎస్ఆర్కు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు.


 


చిలకలూరిపేటలో వైఎస్ఆర్ జయంతి సందర్బంగా భారతరత్న ఇందిరాగాంధీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు స్వీట్లు పంచారు. ఆ కార్యక్రమంలో జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.


 


ప్రకాశం జిల్లా: చీరాలలో వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. కందుకూరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పోతుల రామారావు పాలాభిషేకం చేసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్కాపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తులు పూలమాలు వేసి నివాళులర్పించారు.

 


 


నెల్లూరు జిల్లా: జిల్లాలో దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి ఘనంగా జరిగింది. వేదాయపాలెం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ క్షీరాభిషేకం చేసి, పూలమాలతో వేసి నివాళులర్పించారు.  

 


 


విశాఖపట్నం జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి వేడుకులు విశాఖపట్నం మహానగరంలోని వాడవాడలా ఘనంగా జరిగాయి. పెద్దవాల్తేర్ జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఆ పార్టీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భీమిలి, మదురవాడ, తగరపువలస, ఆనందపురం మండలాల్లో వైఎస్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ఏడీ కొత్త రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఘనంగా నివాళులర్పించారు.

 


 


విజయనగరం జిల్లా: జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయనగరంలో వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రాజీవ్ క్రీడీ మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, పార్టీ జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజులు ప్రారంభించారు.


 



శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాతపట్నంలో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే వెంకట రమణ పూలమాల వేసి నివాళులర్పించారు. పార్వతీపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


 


మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామచంద్రాపురం బీరంగూడ కమాన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభు గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 


వరంగల్ జిల్లా: మహబూబాబాద్లో స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎల్లారెడ్డి మహేందర్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  


 


ఖమ్మం జిల్లా: సత్తుపల్లిలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ మట్టా దయానంద్తోపాటు పలువురు ఆ పార్టీ నాయకులు మహానేత విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అశ్వరావుపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు. వైరాలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి స్థానిక ఎమ్మెల్యే మదన్లాల్ ఘనంగా నివాళులర్పించారు.

 

 


 


నల్గొండ జిల్లా: జిల్లాలో వైఎస్ఆర్ 65వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మిర్యాలగూడలో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


 


కరీంనగర్ జిల్లా: కరీంనగర్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 


న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కలలు కన్న సువర్ణయుగాన్ని తీసుకొచ్చేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 65వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో వైఎస్ఆర్ చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జయంతి వేడుకల కార్యక్రమంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరప్రసాద్, బుట్టారేణుక, కొత్తపల్లి గీతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top