
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 69వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రెడ్డిగుంట బాడవ శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. సురమాల గ్రామంతో వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది. అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ, పెనబాక, పీటీ కండ్రిగ, అర్లపాడు క్రాస్, చెంబేడు, నందిమాల క్రాస్, సీఎన్‌పేట, ఉమ్మాలపేట వరకూ పాదయత్ర కొనసాగుతుంది.
ముగిసిన 68వ రోజు పాదయాత్ర
చిత్తూరు జిల్లా రెడ్డిగుంట బాడవ వద్ద వైఎస్ జగన్ 68వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. తంగెళ్లమిట్ట, పార్లపల్లి, పల్లమాల, కత్తివారి కండ్రిగ, బసవన్నగుంట, ఆలత్తూరు క్రాస్ మీదగా రెడ్డిగుంట బాడవ వరకూ యాత్ర కొనసాగింది. ఇవాళ వైఎస్ జగన్ 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకూ ఆయన 923.1 కిలోమీటర్లు నడిచారు.