మల్లన్న సేవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి | YS Jagan Mohan Reddy went to the Srisailam temple | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jan 7 2017 1:43 AM | Updated on Sep 27 2018 5:46 PM

మల్లన్న సేవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

మల్లన్న సేవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వేదాశీర్వచనాలు అందించిన వేద పండితులు

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్చారణతో ఆయనకు ఆహ్వానం పలికారు. స్వామి, అమ్మవార్లకు జగన్‌ శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు.

తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు, అర్చకులు తీర్థప్రసాదాలను ప్రతిపక్ష నేతకు అందించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలతోపాటు జ్ఞాపికను జేఈఓ అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement