
విశాఖ స్టీలుప్లాంటును సందర్శించిన వైఎస్ జగన్
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. తుఫాను వల్ల స్టీల్ ప్లాంటుకు జరిగిన నష్టం గురించి అక్కడ పనిచేసే కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి తుఫాను వల్ల నష్టపోయిన ఇస్లాంపేటను వైఎస్ జగన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో తుఫాను కారణంగా కూలిపోయిన మసీదును సందర్శించి, ముస్లిం సోదరులకు ఆయన భరోసా ఇచ్చారు.