జగన్‌ హామీలు   | YS Jagan election promises list | Sakshi
Sakshi News home page

జగన్‌ హామీలు  

Apr 5 2019 2:42 AM | Updated on Apr 5 2019 2:42 AM

YS Jagan election promises list - Sakshi

►పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం.  
►ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. 
►ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం.  
►మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. 
►45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం.  
►పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
►రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం.  
►అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం.   
►ఇల్లు లేని పేదల కోసం అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం.  
►రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలనుభర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  
►ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాం.  
►జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.   
►  సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం.  
► చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు,రజకులకు, టైలర్లకు ఏడాదికిరూ.10 వేలు అందజేస్తాం.  
►13 లక్షల మంది అగ్రిగోల్డ్‌  బాధితులను ఆదుకోవడానికి  అధికారంలోకి రాగానే  తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు కేటాయిస్తాం.  
► అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం.  
► ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న65 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం.  
►సంఘమిత్ర, వీవోఏలు,వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement