282వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 8:01 PM

YS Jagan 282th Day Prajasankalpayatra Schedule - Sakshi

సాక్షి, చీపురుపల్లి : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 282వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం గరికవలస నుంచి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాసంకల్పయాత్ర గజపతి నగరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ నియోజకవర్గంలోని కెంగువ, ముచ్చెర్ల, కొండపేట క్రాస్, జిన్నం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 281వ రోజు పాదయాత్ర సోమవారం గరికవలస వద్ద ముగిసింది. సోమవారం ఉదయం జననేత పాదయాత్రను గుర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్‌, అనందపురం క్రాస్‌ మీదుగా గరికవలస వరకు 7.2 కిలోమీటర్లు సాగింది. రాజన్నబిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా ఆనందపురం క్రాస్‌ వద్ద ఈ మైలురాయికి గుర్తుగా జననేత వేప మొక్కను నాటారు.

చదవండి: వైఎస్ జగన్ పాదయాత్రలో మరో మైలురాయి

Advertisement
Advertisement