సీఎం హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తాం: పొన్నం | will blast kiran kumar reddy helicopter in air, says Ponnam prabhakar | Sakshi
Sakshi News home page

సీఎం హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తాం: పొన్నం

Jan 2 2014 11:46 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తాం: పొన్నం - Sakshi

సీఎం హెలికాప్టర్ను గాల్లోనే పేల్చేస్తాం: పొన్నం

కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ....ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరీంనగర్ : తెలంగాణ ప్రాంత నాయకుడు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణలో తిరగటానికి వీల్లేదన్నారు.  సీఎం తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని పొన్నం డిమాండ్ చేశారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తే గాల్లోనే తుపాకీ పెట్టి ఆ హెలికాప్టర్ పేల్చేస్తామని వ్యాఖ్యానించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాకుండా ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని ఆయన అన్నారు. సిగ్గులేకుండా సీఎం కరీంనగర్ వస్తారని ప్రశ్నించారు. సీఎంను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని పొన్నం అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టనివ్వమని స్పష్టం చేశారు.

తెలంగాణపై సీడబ్ల్యుసీ నిర్ణయం తర్వాత కిరణ్ సంతకం పెట్టిన ఫైళ్లపై విచారణ జరగాలని, ఆయన అవినీతిపై విచారణ జరగాలని పొన్నం అన్నారు. కిరణ్ కటకటాలు లెక్కించాల్సిందేనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో సీఎం అడుక్కోడానికి కూడా అర్హత లేకుండా పోతాడని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement