రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు | Vigilance Attack on Ration Shops West Godavari | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపులపై విజిలెన్స్‌ దాడులు

Jan 4 2019 6:52 AM | Updated on Jan 4 2019 6:52 AM

Vigilance Attack on Ration Shops West Godavari - Sakshi

లక్కవరం రేషన్‌ షాపులో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం రూరల్‌: మండలంలోని లక్కవరం గ్రామంలోని మూడు రేషన్‌ దుకాణాలపై గురువారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్‌ సీఐ భాస్కర్, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేసి లోపాలను గుర్తించారు. షాపు నం.17లో 82 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.51లో 1,205 కేజీల బియ్యం తక్కువగా, షాపు నం.50లో 551 కేజీల బియ్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినట్లు విజిలెన్స్‌ సీఐ భాస్కర్‌ తెలిపారు. ఆయా షాపులపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆర్‌ఐ సునీత, వీఆర్వోలు పాల్గొన్నారు.

పొలమూరులో నిల్వల్లో వ్యత్యాసాలు
పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరులో షాపు నం.20 రేషన్‌ డిపోపై గురువారం విజిలెన్స్‌ అధికారులు దాడి చేశారు. షాపులోని రికార్డులను, సరుకుల నిల్వలను తనిఖీ చేయగా 353 కేజీల బియ్యం, 5.5 కేజీల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత డీలర్‌ 32వ రేషన్‌ షాపునకు కూడా ఇన్‌చార్జిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సరుకుల నిల్వలో వ్యత్యాసాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement