చెన్నాయిపాలెంలో ఇరువర్గాల ఘర్షణ.. | two sections clashed in chennaipalem | Sakshi
Sakshi News home page

చెన్నాయిపాలెంలో ఇరువర్గాల ఘర్షణ..

Jun 14 2016 10:46 PM | Updated on Aug 24 2018 2:36 PM

గేదెలు విషయంపై రాజుకున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణ దారితీసింది. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం ఇళ్లపై కత్తులతో, కొడవళ్లతో దాడి చేశారు.

పిడుగురాళ్ల (గుంటూరు): గేదెలు విషయంపై రాజుకున్న వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణ దారితీసింది. దీంతో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం ఇళ్లపై కత్తులతో, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చెన్నాయిపాలెంలో మంగళవారం రాత్రి జరిగింది. చెన్నాయిపాలెం వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వారి గేదెలు ఇంటి తోలుకొస్తుండగా టీడీపీ వర్గీయులు కొందరు అడ్డగించారు.

ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణగా మారింది. దీంతో టీడీపీకి చెందిన గండిగోట మురళీ, అనంత, హరికృష్ణ, రాఘవ, బాలకృష్ణ, మురళీ భార్య తదితరులు ఆవుల వెంకటకోటయ్య, శివయ్యల ఇంటిపై కత్తులు కొడవళ్లతో దాడిచేశారు. ఈ సంఘటనలో వెంకటకోటయ్య, శివయ్య తీవ్రగంగా గాయపడ్డారు. బాధితులు పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement