
సాక్షి, తిరుపతి: తిరుమల ఆలయ అధికారులు పెద్దజీయర్ స్వామిని చెన్నైకు తరలించారు. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న పెద్ద జీయర్ లక్షణాలు తీవ్రమవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఇప్పటికే అపోలోలో చికిత్స పొందుతున్న అర్చకులు కాత్రిపతి నరసింహాచార్యులు కోలుకుంటున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న మరో ముగ్గురు అర్చకులు ఆరోగ్య పరిస్థితికి కూడా మెరుగ్గా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. (డాలర్ శేషాద్రిపై అసత్య ప్రచారం, కేసు నమోదు)