పోలీస్‌ ఉద్యోగం కోసం వెళ్లి... | Tragedy in the Body Endurance Test of police | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగం కోసం వెళ్లి...

Jan 11 2017 1:48 AM | Updated on Sep 2 2018 3:46 PM

ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలో భాగంగా పరుగు తీస్తూ కుప్పకూలిన అభ్యర్థి చికిత్స అనంతరం మృత్యువాతపడ్డాడు

దేహదారుఢ్య పరీక్షలో కుప్పకూలిన అభ్యర్థి.. చికిత్స అనంతరం మృతి

ఏలూరు అర్బన్‌: ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలో భాగంగా పరుగు తీస్తూ కుప్పకూలిన అభ్యర్థి చికిత్స అనంతరం మృత్యువాతపడ్డాడు.  ఎస్సై ఉద్యోగార్థులకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అమీనా పేటలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సోమవారం 1,600 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహించారు. దీనిలో పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హరిపురానికి చెందిన ఎల్‌వీసీ శేఖర విశ్వనాథం కుప్పకూలిపోయాడు.

అధికారులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడిందని నిర్ధారించిన వైద్యులు సోమవారం సాయంత్రం అతడిని డిశ్చార్జి చేయగా స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మంగళవారం   పరిస్థితి విషమించడంతో ఇంటివద్ద మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement