భూపంపిణీ లక్ష్యం పూర్తి | the target of distribution of land is complete | Sakshi
Sakshi News home page

భూపంపిణీ లక్ష్యం పూర్తి

Feb 7 2014 3:16 AM | Updated on Sep 2 2017 3:24 AM

జిల్లాలో ఏడోవిడత భూపంపిణీ లక్ష్యాన్ని నూరుశాతం సాధిం చినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు.

 ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో ఏడోవిడత భూపంపిణీ లక్ష్యాన్ని నూరుశాతం సాధిం చినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, భూసంబంధిత కేసులు తదితరాంశాలపై భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూపంపిణీ లక్ష్యాల సాధన తదితరాంశాలను కలెక్టర్ వివరించారు.

ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు మాట్లాడు తూ.. ఈ నెల 10వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని రెవెన్యూ సదస్సులను వాయిదా వేసినట్టు చెప్పారు. వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారంటూ కలెక్టర్‌ను అభినందించారు. ఈ-పాస్ పుస్తకాల జారీపై అవగాహన కల్పిం చాలని, పాత పాస్ పుస్తకాలను వాపస్ తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేం దుకుగాను తహశీల్దారులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీని వాస్, ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement