ఒక్క సర్వే రాయి వేసినా ఊరుకోం

Tellam Balaraju support To Greenfield Highway Farmers - Sakshi

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రైతుల ఆందోళనకు బాలరాజు మద్దతు

 జేసీతో సంప్రదింపులు

 ఈనెల 16న బహిరంగ చర్చావేదిక

కొయ్యలగూడెం: గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే నిర్మాణ సర్వే పనుల్లో ఒక్క సర్వే రాయి పడినా సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజవరం స మీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే సర్వే పనుల వద్ద నిరవధిక ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వందల ఎకరాల్లోని పచ్చని పంటలు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన మద్దతు ధరను ఇవ్వమనడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందని, రైతుల కడుపుకొట్టి చంద్రబాబు సర్కార్‌ కడుతున్న కట్టడాలు కూల్చివేస్తామని బాలరాజు పేర్కొన్నారు.

 సబ్‌ రిజిస్ట్రార్‌ విలువ ప్రకారం ప్రస్తుత మార్కెట్‌ విలువను అమలు చేసి దానికి రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ కలుగుతుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు అధికంగా జీవనాధారమైన భూములు కోల్పోతే వారి బతుకులు, కుటుంబాలు అధోగతిపాలవుతాయని బాలరాజు ఆందోళన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు సైతం తమ బాధలను బాలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం బాలరాజు జాయింట్‌ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రావాల్సిందిగా కోరారు. 

దీంతో ఈనెల 16న రాజవరానికి వచ్చి బాధిత రైతులతో బహిరంగ చర్చావేదికను నిర్వహిస్తామని జేసీ పేర్కొన్నారు. మండల కన్వీనర్‌ గొడ్డటి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీను, దాసరి విష్ణు, మైనార్టీసెల్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కే బాజీ, మాజీ సర్పంచ్‌ పాముల నాగ మునిస్వామి, వైఎస్సార్‌సీపీ నాయకులు కె.సూరిబాబు, బల్లె నరేష్, చింతలపూడి కిషోర్, గద్దే సురేష్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top