రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ మంత్రులు | telangana ministers to move delhi tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ మంత్రులు

Nov 14 2013 8:40 PM | Updated on Sep 4 2018 5:07 PM

తెలంగాణ మంత్రులు మరోమారు ఢిల్లీ పయనం కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మరోమారు ఢిల్లీ పయనం కానున్నారు. శుక్రవారం ఉ.6.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన తెలంగాణ మంత్రులు జీఓఎంతో సమావేశమవుతారు. వీరిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి, ఇతర మంత్రులు జీఓఎంతో భేటీ అవుతారు. ఈ రోజు జీఓఎంతో సమావేశమైన కేంద్ర కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈనెల 18 వ తేదీన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీఓఎం సభ్యులతో భేటీ కానున్నారు.

 

వచ్చే సోమవారం ఉ.10.30కు టి.కేంద్ర మంత్రులతో జీఓఎంతో భేటీ కానుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఉ.11.30కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమవుతారన్నారు. అనంతరం మ.12.30 గంటలకు సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి జీఓఎంతో బేటీ అవుతారు. ఈ నెల 20వ తేదీలోగా ముసాయిదా బిల్లుకు తుది రూపమిచ్చే అవకాశం ఉందని జైరాం రమేష్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement