నెల 15వ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.
విజయవాడ : ఈనెల 15వ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత రైతులకు కొత్తరుణాలు మంజూరు అవుతాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రాజధానికి, రైతుల భూములకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఏపీ రాజధానికి భూములు ఇచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి మెరుగైన ప్రయోజనం కోసం ప్యాకేజీ అందిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆయన ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. అలాగే పెడన నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు.