టీడీపీ నేత నకి‘లీలలు’

TDP Activist Illegal Works In Srikakulam - Sakshi

చాంతాడంత అక్రమాలు

ఒకవైపు టీడీపీ నాయకుడిగా.. మరోవైపు రేషన్‌ డీలర్‌గా దందా 

ప్రభుత్వ భూముల నంబర్లతో రికార్డుల సృష్టి

ఒకవైపు టీడీపీ నేత. మరోవైపు రేషన్‌ డిపో డీలర్‌. అక్కడ ఆయన చెప్పిందే వేదం. చేసిందే న్యాయం. ఏ అధికారైనా తల ఊపాల్సిందే. ఆయన దందా అంతా ఇంతా కాదు. ప్రభుత్వ భూములకు తమ కుటుంబీకుల పేరిట పట్టాలు సృష్టించారు. వాటిపైనే రుణాలు పొందారు. రుణమాఫీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారు. అంతటితో ఆగకుండా వాటినే బ్యాంకుల్లో కుదువ పెట్టి లక్షలాది రూపాయలు రుణం సంపాదించారు. అవినీతి బాగోతంపై ఎవరైనా అడిగితే నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. నిలదీస్తే దౌర్జన్యం చేస్తారు. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఇంతటి ఘన చరిత్ర గల మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామ రేషన్‌ డీలర్‌ హనుమంత్రు చంద్రశేఖర్‌ నకిలీ లీలలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.  

సాక్షి, శ్రీకాకుళం : మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామ టీడీపీ నేత హనుమంతు చంద్రశేఖర్‌ రేషన్‌ డిపో డీలర్‌గా కొనసాగుతున్నాడు. డీలర్‌గా పనిచేస్తున్నా... చేసేవన్నీ టీడీపీ రాజకీయాలే. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అండతో రాజకీయాలు నెరుపుతున్నాడు. ఆ ధైర్యంతో ప్రభుత్వ  భూముల్ని వారసత్వ, డీ పట్టా భూములుగా తన పేరున, త న భార్య పేరున, తమ బంధువుల పేరున రికార్డుల్లో రాయించుకున్నాడు. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి పట్టాలు సృష్టించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు తీసుకున్నాడు. తిత్లీ తుఫాన్‌ నష్టపరిహారాన్నీ దక్కించుకున్నాడు. తాజాగా రైతు భరోసా కింద ప్రభుత్వ సాయాన్ని కాజేశాడు. పెళ్లిళ్లు అయిపోయిన వారి పేరున, చనిపోయిన వారి పేరున ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేయకుండా వాటిని తన వద్దే ఉంచుకుని పెద్ద ఎత్తున రేషన్‌ సరుకులను మింగేశాడు.  

భూముల నకిలీ బాగోతమిది.. 
మెళియాపుట్టి మండలంలోని కరజాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొండ పోరంబోకుగా ఉన్న రెవెన్యూ భూమిపై చంద్రశేఖర్‌ కన్ను పడింది. సర్వే నెంబర్లు 373–41, 373–42, 373–43లో ఉన్న 3.62 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భా ర్య హేమలత పేరుతో పట్టా చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకుని కంప్యూటర్‌ అడంగల్‌ పొందాడు. వాస్తవానికి ప్రభుత్వ భూమి పొందితే డీడీ పట్టా అని రాయించాలి. తననెవరు గమనిస్తారనుకున్నారేమో గాని అనువంశికం అని రికార్డుల్లో నోట్‌ చేయించాడు. ఆ పట్టాలను చూపించి గొప్పిలి సిండికేట్‌ బ్యాంకులో రూ. 75,655 రుణం తీసుకున్నాడు. తన పేరున 239/3, 240/2, 204/4,  251/5, 189/పీ, 263/1 సర్వే నెంబర్లతో 4.29ఎకరాల మేర పట్టాలు సృష్టించారు.


హనుమంతు చంద్రశేఖర్, తన భార్య పేరున రుణం పొందిన సిండికేట్‌ బ్యాంకు రికార్డి

వాటిని చూపించి రెండు దఫాలుగా రూ.82,907, రూ.98,230 మేర రుణాలు తీసుకున్నా డు. పలాస మండలం గోపివల్లబాపురం గ్రామంలో తన బంధువుల పేరిట కూడా 8.38 ఎకరాల ప్రభుత్వ భూమిని పొం దాడు. తన పేరున, తన భార్య పేరున పట్టాలు సృష్టించినప్పుడు ఏ తహశీల్దారైతే ఉన్నారో ఆయన పలాస మండలం లో పనిచేసినప్పుడు ఆయన బంధువుల పేరున డీ పట్టా భూమి కట్టబెట్టారు. దీన్నిబట్టి నాడు పనిచేసిన తహశీల్దార్‌ కనుసన్నల్లోనే పట్టా పాసుపుస్తకాల సృష్టి, రికార్డుల్లో నమోదు కార్యక్రమం జరిగినట్టు స్పష్టమవుతున్నది. ఈ పాసు పుస్తకాలు, రికార్డులను చూ పించి రుణమాఫీ, తిత్లీ పరిహారం, వైఎస్సార్‌ రైతు భరో సా–పీఎం కిసాన్‌లో కూడా లబ్ధిపొందాడు. గత ప్రభుత్వం లో రైతు రథం పథకం కింద రెండు ట్రాక్టర్లు కూడా పొం దారు. విశేషమేమిటంటే తనకు భూములు లేకపోయినప్ప టికీ భూములున్నట్టు రికార్డులను చూపించడంపై ఒకాయన ఫిర్యాదు చేసేసరికి తన పేరున ఉన్న భూములను రికార్డుల నుంచి తొలగించారు.  

రేషన్‌ అక్రమాలు  
రేషన్‌ డీలరుగా కూడా చంద్రశేఖర్‌ చేయని అక్రమమంటూ లేదు. రేషన్‌ సరుకులు తూకంలో తక్కువగా ఇవ్వడం, అధిక ధరలు వసూలు చేయడం, మరణించిన వారి పేర్లను, వివా హం జరిగి అత్తవారిళ్లకు వెళ్లిన వారి పేర్లు తొలగించకుండానే ఆయా కుటుంబ సభ్యులకు మీపేర్లు తొలగించామని నమ్మించి, ఆ రేషన్‌ సరుకులను తానే  సంవత్సరాల పాటు స్వాహా చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పేర్ల తో ను రేషన్‌ కార్డులు తయారు చేయించి వారి సరుకులు కూడా స్వాహా చేశారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 200 రేషన్‌ కార్డుల సరుకులు ఈ రకంగా అనుభవించినట్టు తెలుస్తోంది.  

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం 
ఈ విషయంపై సాక్షి కలెక్టర్‌ జె.నివాస్‌ వివరణ కోరగా ఇంతవరకు తన దృష్టికి ఈ విషయం రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని, వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 
అన్నీ అక్రమాలే.. 
సరుకుల పంపిణీ నుంచి ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడం వరకు, బ్యాంకుల్లో రూ.లక్షల్లో రుణా లు తీసుకోవడం, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారాలను పొందటం.. ఇలా అన్నీ అక్రమాలే. కరజాడ రేషన్‌ డీలరు కొందరు అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించడం, తొలగించడం సునాయాసంగా చేస్తున్నాడంటే సిబ్బంది ఎంతగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.  
– బమ్మిడి ఖగేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, 

పేరు తొలగిస్తాం 
రేషన్‌ డీలరు హనుమంతు చంద్రశేఖ ర్‌ భార్య హేమలత పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు నమోదు కా లేదు. కాని కంప్యూటర్‌ అడంగల్‌ మాత్రం చూపిస్తోంది. కంప్యూటర్‌ అడంగల్‌ రాకుండా ప్రస్తుతం నిలుపుదల చేయడం జరిగింది. కంప్యూటర్‌ నుంచి హేమలత పేరు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈమె పేరు కంప్యూటర్‌ అడంగల్‌ వచ్చేలా ఎప్పుడు నమోదు జరిగిందో కచ్చితంగా చెప్పలేం. ప్రభుత్వం నుంచి పొందిన రుణమాఫీ, పంటల నష్ట పరిహారానికి సంబంధించి విచారణ జరిపిస్తాం. నిజమని రుజువైతే ఆర్‌ఆర్‌ యాక్టును ప్రయోగించి రికవరీ చేస్తాం.
–ఎస్‌.దామోదరం, తహశీల్దారు, మెళియాపుట్టి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top