గుంటూరు జిల్లాలో విషాదం | Students Drown in Krishna River at Tadepalli | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో విషాదం

Aug 10 2014 8:37 AM | Updated on Nov 9 2018 4:12 PM

గుంటూరు జిల్లాలో విషాదం - Sakshi

గుంటూరు జిల్లాలో విషాదం

ముగ్గురు విద్యార్థినులు కృష్ణా నదిలో గల్లంతైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ లో చోటు చేసుకుంది.

గుంటూరు: పండగపూట గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మృతులు పల్లవి, పూజిత, నాగలక్ష్మిగా గుర్తించారు. మృతులు విజయవాడలోని ఆటోనగర్ కు చెందిన వారు. ఓ కార్పొరేట్ కాలేజీలో వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు తెలిసింది.

నిన్న ఉదయం కాలేజీకి వెళుతున్నామని చెప్పి వీరు ఇంటి నుంచి వచ్చారు. శనివారం రాత్రి వీరు నదిలో గల్లంతైవుంటారని భావిస్తున్నారు. అయితే విజయవాడకు చెందిన వీరు గుంటూరు జిల్లా వైపు ఎందుకు వచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాఖీ పండుగ రోజున విషాదం నెలకొనడంతో విద్యార్థినులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement