అటవీశాఖ కొర్రీలు | Srisailam forestry work in the expansion of the main road | Sakshi
Sakshi News home page

అటవీశాఖ కొర్రీలు

Sep 9 2013 5:08 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్- శ్రీశైలం ప్రధాన రహదారి విస్తరణ పనులకు అటవీశాఖ కొర్రీలు పెట్టడంతో పనులు నిలిచిపోయా యి. ఈ ప్రధాన రహదారిలోని భూత్‌పూర్(గోపాలపూర్)- బిజినేపల్లి, నాగర్‌కర్నూల్(జమిస్తాపూర్)- తెల్కపల్లి మధ్య ఉన్న సింగిల్ లైన్ రోడ్డు ఉంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించేవారికి నరకం కనిపిస్తుంది.

అచ్చంపేట, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్- శ్రీశైలం ప్రధాన రహదారి విస్తరణ పనులకు అటవీశాఖ కొర్రీలు పెట్టడంతో పనులు నిలిచిపోయా యి. ఈ ప్రధాన రహదారిలోని భూత్‌పూర్(గోపాలపూర్)- బిజినేపల్లి, నాగర్‌కర్నూల్(జమిస్తాపూర్)- తెల్కపల్లి మధ్య ఉన్న సింగిల్ లైన్ రోడ్డు ఉంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించేవారికి నరకం కనిపిస్తుంది. అంచులు కు దించుకుపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఒక వాహనం వెళ్తే మరో వాహనం కిందకి దిగాల్సిందే. అయితే అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 10.5 కిలోమీటర్ల రహదారిని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 2012 డిసెంబరులో రూ.7.17 కోట్లు మంజూరయ్యాయి. వీటిద్వారా అచ్చంపేట మండలం పల్కపల్లి స్టేజీ నుంచి బల్మూర్ మండలం జిన్‌కుంట బ్రిడ్జి వరకు, రంగాపూర్- కుంచోనిమూల మధ్య రోడ్డుపనులు చేపట్టాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ గతనెల 28న రంగాపూర్, కుంచోనిమూల మధ్య రోడ్డుపనులు మొదలు పెట్టడంతో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో 2.5 కిలోమీటర్ల రోడ్డుపనులకు బ్రేక్ పడింది.
 
 నత్తనడకన బ్రిడ్జి జనులు
 అచ్చంపేట- రంగాపూర్ రహదారిలో బొల్గట్‌పల్లి స్టేజీ వద్ద చంద్రసాగర్ వాగుపై నిర్మించిన వంతెన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2012లో వంతెన నిర్మాణానికి రూ.2.75 కోట్లు మంజూరయ్యాయి. జూన్, ఆగస్టులో కురిసిన భారీవర్షానికి డైవర్షన్ రోడ్డు రెండుసార్లు కొట్టుకపోయింది. ఈ రోడ్డుపై మహబూబ్‌నగర్- శ్రీశైలం వెళ్లే వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్డు పునరుద్ధరించిన ఈమార్గం గుండా వెళ్లేందుకు వాహనాదారులు జంకుతున్నారు. భారీవర్షాలు పడి మళ్లీ వాగు సాగితే ఇది వరకటి పరిస్థితి మొదటికి తలెత్తుతుంది. వర్షాలు పడుతుండటంతో పనులకు ఇబ్బంది కలుగుతుందని, త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్ తెలిపారు.
 
 అభ్యంతరం దేనికి..!
 కాంట్రాక్టర్ చేపట్టిన పనులకు సామాజిక వనానికి సంబంధం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైన్ బీటీరోడ్డుకు ఇరువైపుల మాత్రమే విస్తరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ అటవీ పరిధిలోకి వెళ్లి పనులు ప్రారంభించనప్పుడు వీరికి అభ్యంతరం ఎందుకో అర్థంకావడం లే దు.  శ్రీశైలం రోడ్డు ఈ ఇటీవలకాలంలో వేసింది కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. అలాం టప్పుడు అధికారులు అడ్డుకోవల్సిన అవసరం ఎందుకు వచ్చిందని స్థానికులు ప్ర శ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని అటవీశాఖ అభ్యంతరాలను పరి శీలించి రోడ్డుమార్గాన్ని మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement