ధర్మానతోనే జిల్లా అభివృద్ధి

srikakulam District Development to Dharmana Prasada Rao - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాను సస్యశ్యామలం చేయాలనే కృత నిశ్చయంతో వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేసిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వన్నె తెచ్చిన నాయకుడు ధర్మాన అని కొనియాడారు. ఈ నెల 21వ తేదీ సోమవారం 60వ పుట్టినరోజు వేడుకలు ధర్మాన ఇంటి వద్ద ఘనంగా నిర్వహించనున్నామన్నారు. ఉదయం 7గంటలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని అనంతరం బంగ్లాలో కేక్‌ కట్‌చేస్తామన్నారు.

 తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతా యన్నారు.  వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి ధర్మాన అని అన్నా రు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి కుడి భుజంగా ఉంటూ జిల్లా అభివృద్ధికి రిమ్స్‌ మెడికల్‌ కళాశాల, వంశధార ప్రాజెక్టు నిర్మాణం, ఆఫ్‌షోర్‌ వంటి ఎన్నో జిల్లాకు తీసుకొచ్చి సిక్కోలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని  అన్నా రు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంలో, జిల్లా అభివృద్ధిలో ధర్మాన కీలకపాత్ర పోషిస్తారన్నారు.

 యువజన విభాగం నాయకుడు మామి డి శ్రీకాంత్‌ మాట్లాడుతూ ధర్మాన పుట్టిన రోజు నా డు 38 మండలాల నుంచి వచ్చే నాయకులు ఓ పద్ధతి ప్రకారం ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తె లిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో రారు. సమావేశంలో యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్, కె.ఎల్‌.ప్రసాద్, ఎం.ఎ .రఫీ, శిమ్మ వెంకటరావు, కోరాడ రమేష్, మండవిల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పొన్నాడ రుషి, పురుషోత్తం, ఊన్న నాగరాజు, కరమ్‌చంధ్, ఆర్‌.ఆర్‌.మూర్తి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top