యూత్‌ ఫెస్టివల్‌లో ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థిని | SRI student at Youth Festival | Sakshi
Sakshi News home page

యూత్‌ ఫెస్టివల్‌లో ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థిని

Feb 18 2018 11:53 AM | Updated on Sep 18 2019 3:24 PM

బుక్కరాయసముద్రం : రోటరీపురంలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని వాసవీ అనంతపురం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ స్థాయి యూత్‌ ఫెస్టివల్‌–2018లో ప్రతిభ కనబరిచినట్లు  ప్రిన్సిపాల్‌ సుబ్బారెడ్డి, సీఈఓ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జనవరి10న అనంతపురం జేఎన్‌టీయూ కళాశాలలో వ్యాసరచన పోటీలు, క్విజ్, దేశభక్తిపై పద్యాలు, పేపర్‌ ప్రెజెంటేషన్, సంగీత వాయిద్యాలు, మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఫొటో ప్రదర్శనలు తదితర 13 రకాల పోటీలు నిర్వహించారన్నారు. అందులో  ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రాం కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య, శ్రీనివాసకుమార్, జ్ఞాపికను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement