కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె గ్రామంలో వర్షం కోసం కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బేతంచెర్ల (కర్నూలు): కర్నూలు జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని బుగ్గానిపల్లె గ్రామంలో వర్షం కోసం కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామంలోని మహిళలు, రైతులు భక్తి శ్రద్ధలతో ఆలయం వరకు తరలి వచ్చి కనుమ ఆంజనేయస్వామి అభిషేకం, ఆకుపూజ, కుంకమార్చన, మహా మంగళ హారతి నిర్వహించారు.
అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షం పడకపోవడంతో వరుణ దేవుని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాముడు,రామచంద్రుడు, గోరంట్ల, జయరాముడు, వెంకటసుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.