మీకే కాదు.. మాకు కూడా ఏసీబీ ఉంది
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు
నెల్లూరు : తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'మీకే కాదు మా దగ్గర ఏసీబీ ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని మరిచిపోతున్నారని, ఏసీబీపై మాకు హక్కుంది' అని ఆయన గురువారమిక్కడ అన్నారు. చంద్రబాబు వాయిస్ రికార్డులు ఉన్నాయని చెబుతున్నారని...అలాగే తమ ఎమ్మెల్యేలతో కేసీఆర్, ఎంపీ కవిత, కేటీఆర్ మాట్లాడిన వాయిస్ రికార్డులను కూడా బయటపెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో అవినీతిపరులు అప్రమత్తం అయ్యారని ఆయన అన్నారు. చ
కాగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని ఆయన అన్నారు. దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైవిధంగా స్పందించారు.


