ఆరోగ్యాన్ని కాటేసే క్యాట్ ఫిష్‌ను గుట్టుగా సరిహద్దులు దాటించారు. మూడు రోజులుగా అక్రమ రవాణా సాగుతున్న రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మంత్రాలయం, న్యూస్‌లైన్: ఆరోగ్యాన్ని కాటేసే క్యాట్ ఫిష్‌ను గుట్టుగా సరిహద్దులు దాటించారు. మూడు రోజులుగా అక్రమ రవాణా సాగుతున్న రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామ సమీపంలోని మోహినిపురం చేపల చెరువుల నుంచి క్యాట్ ఫిష్ తరలించారు. దాదాపు 5 చెరువుల్లో సాగు చేసిన క్యాట్ ఫిష్‌లను ఎగుమతి చేశారు. రోజుకు రెండు లారీలు చొప్పున మూడు రోజులుగా తరలించారు.
చెరువుల దగ్గర ప్రత్యేక వలలు ఏర్పాటు చేసి చేపలను గ్రేడింగ్ చేశారు. అనంతరం తూకాలు వేసి లారీల్లో నింపారు. లారీకి 8 టన్నుల ప్రకారం మధ్యప్రదేశ్‌కు రెండు రోజుల్లో చేరుకుని అక్కడ మార్కెటింగ్ చేస్తారు. ఆదివారం ఆ ప్రాంతానికి చె ందిన రెండు లారీల్లో మాధవరం బ్రిడ్జి నుంచి కర్ణాటక మీదుగా తీసుకెళ్లారు. యథేచ్ఛగా క్యాట్ ఫిష్ పెంచుతున్నా .. తరలిస్తున్నా.. విషయం తెలిసినా ఇక్కడి రెవెన్యూ అధికారులు కుర్చీలు వీడటం లేదు. ఇదే అదునుగా చేసుకున్న పెంపకం దారులు, వ్యాపారులు క్యాట్‌ఫిష్‌తో కాసులు కురిపించుకుంటున్నారు.


