నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మరణించారు.
నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మరణించారు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాములు బందోబస్తు నిర్వహణ కోసం నల్గొండ జిల్లాకు వచ్చారు.
నకిరేకల్ బైపాస్పై రాములు ప్రయాణిస్తుండగా లారీ డీకొంది. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాములు చికిత్స పొందుతూ మృతిచెందారు.