ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగిద్దాం | should get hopes on government schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగిద్దాం

Jun 12 2014 2:50 AM | Updated on Jul 26 2019 6:25 PM

ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి ఒక్కరిలో నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులందరూ శక్తి వం చన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు.

నెల్లూరు (కలెక్టరే ట్): ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి ఒక్కరిలో నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులందరూ శక్తి వం చన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొల గించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలవైపే ఎక్కువ మంది తల్లిదండ్రులు మొగ్గు చూపడం దురదృష్టకరం అన్నారు. అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో లోపాలు తలెత్తడం బాధాకరమన్నారు. ఈ విద్యా సం వత్సరం నుంచైనా జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చెయాల్సిన అవసరం ఉందన్నారు.
 
 ప్రభుత్వ పాఠశాలల్లో మం చి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల న్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా నడిపేందుకు ఏర్పా ట్లు చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల, తాగునీటి, మరుగుదొడ్ల సమస్యలు తలెత్తకూడదన్నారు. పాఠశాలల అభివృద్ధి నిధులు ఖర్చు చేయడంలో ఉపాధ్యాయులు కక్కుర్తి పడితే సహిం చేది లేదన్నారు. పాఠ్యపుస్తకాలు, యూని ఫాంల కొరత లేకుండా చూడాలన్నారు. పదో తరగతిలో జిల్లా నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఇకపై ప్రతిరోజూ విద్యార్థుల హాజరు నివేదికను తనకు పంపాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. ఏజేసీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్ణంగా ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని హెచ్‌ఎమ్‌లను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ ఉష, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌వీఎం పీఓ కోదండరామయ్య  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement