కామాంధుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
చిట్టినగర్(విజయవాడ): కామాంధుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘన విజయవాడలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో షేక్ సారా (24) నివాసం ఉంటోంది. తాపీ పనిచేసే షేక్ కాసీమ్‌కు సారా రెండో భార్య.
కాగా, సారా ఇంటికి సమీపంలో ఉండే సత్యనారాయణ ఆమెను లైంగికంగా కొంత కాలం నుంచి వేధిస్తున్నాడు. తనతో సన్నిహితంగా కలవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు సారా గురించి స్థానికులకు మంగళవారం చెడుగా చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన సారా సాయంత్రం సమయంలో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.