పోలవరం ప్రాజెక్ట్‌కు తొలగిన అడ్డంకి | seven zones of khammam district now goes to andhra pradesh | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్ట్‌కు తొలగిన అడ్డంకి

Jul 12 2014 1:48 AM | Updated on Aug 21 2018 8:34 PM

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ జారీ అరుున ఆర్డినెన్స్‌ను పార్లమెంటు బిల్లు రూపంలో ఆమోదించడంతో పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోరుుంది.

పోలవరం : తెలంగాణ రాష్ట్ర పరిధిలో ని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ జారీ అరుున ఆర్డినెన్స్‌ను పార్లమెంటు బిల్లు రూపంలో ఆమోదించడంతో పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోరుుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత మరిం త పెరిగింది. మరోవైపు ముంపు మం డలాల విలీనంపై సీమాంధ్ర రైతుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

కోస్తా జిల్లాలకు జీవనాడి కానున్న పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలనేది కోస్తాంధ్ర రైతుల దశాబ్దాల నాటి కల. ప్రాజెక్టు నిర్మాణం వల్ల పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని 29, తూర్పుగోదావరి జిల్లాలోని 42 గ్రామాలతోపాటు ఖమ్మం జిల్లా భద్రాచలం మం డలంలో 13, కూనవరం మండలంలో 48, చింతూరు మండలంలో 17, వీఆర్ పురంలో 45, కుకునూరులో 34, వేలేరుపాడులో 39, బూర్గంపాడులో 9 కలిపి మొత్తం 205 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

మొదట్లో ఆ గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. కేవలం గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల ముంపు గ్రామాల గిరిజనులకు భూమికి భూమి, పునరావాసం కల్పించే విషయంలో సమస్యలు ఎదురవుతాయి. దీంతో ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విధంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసి బిల్లుగా ఆమోదించారు. ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకపోతే ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస ప్యాకేజీ అమలుచేయడం కష్టమవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement