జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య | Set to the life of the young man's suicide | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

May 23 2014 3:19 AM | Updated on Nov 6 2018 7:53 PM

జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య - Sakshi

జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లెకు చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు.

అయ్యావాండ్లపల్లె(కల్లూరు), న్యూస్‌లైన్: పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లెకు చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేర కు.. పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లెకు చెందిన కే.రామచంద్రయ్య, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు.

కుమారుడు కే.సురేష్(25) బెంగళూరులోని ఓ ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. చాలీచాలని జీతంతో తల్లిదండ్రులను సక్రమంగా పోషించలేక పోతున్నానని గ్రామానికి వచ్చినప్పు డు  మిత్రుల వద్ద వాపోయేవాడు. ఈ నెల 7వ తేదీన ఓటు హక్కును విని యోగించుకునేందుకు గ్రామానికి వచ్చాడు. ఓటు వేసి మరుసటి రోజు తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతను జీవితంపై విరక్తి చెంది పురుగులు మందు తాగాడు. అనంతరం సమీపంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సురేష్ చెట్టుకు వేలాడుతుండడాన్ని గమనించిన ఇంటి యజమాని మృతుని తల్లిదండ్రులకు,స్థానిక పోలీసులకు సమాచారం అం దించారు.

సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి బెంగళూరుకు వెళ్లి సురేష్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసరాగా ఉన్న కుమారుడు అకాల మృతి చెందడంతో రామచంద్రయ్య, భాగ్యమ్మ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement