రగులుతున్న విభజనాగ్ని | Samaikyandhra Laugh in support of the protest suffers ongole | Sakshi
Sakshi News home page

రగులుతున్న విభజనాగ్ని

Aug 30 2013 4:11 AM | Updated on Sep 1 2017 10:14 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలులో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారమూ కొనసాగాయి.

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలులో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. స్థానిక కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారమూ కొనసాగాయి. దీక్షలో నీటిపారుదల శాఖ, సర్వేశాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. తొలుత నీటిపారుదల శాఖ సీఈ వీర్రాజు, ఎస్‌ఈ ఏ సుధాకర్ శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ శేషు, ఎన్‌జీఓ నాయకులు సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. 
 
 కృష్ణాష్టమి వేడుకలతో జెడ్పీ ఉద్యోగుల నిరసన 
 స్థానిక జిల్లా పరిషత్ వద్ద సీఈఓ గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరి రిలే దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర సమైక్యతకు ఉద్యోగులంతా కలిసి కట్టుగా ఉద్యమించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ప్రకటనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్ నాయకులు లాలపరెడ్డి, వీరనారాయణ, విద్యాసాగర్, సుబ్బారావు, కిరణ్, అంజమ్మ పాల్గొన్నారు. 
 
 కొనసాగుతున్న కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షలు 
 స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చే వరకూ ఆందోళనలు ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చే శారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement