సీఎంకు రూ. 5.50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు | Rs 5.50 crore budget to manufacture for Bullet proof bus | Sakshi
Sakshi News home page

సీఎంకు రూ. 5.50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు

Apr 26 2015 1:46 AM | Updated on Sep 3 2017 12:52 AM

సీఎంకు రూ. 5.50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు

సీఎంకు రూ. 5.50 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన సందర్భంగా మారు మూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రూ.5.50 కోట్ల వ్యయంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన సందర్భంగా మారు మూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రూ.5.50 కోట్ల వ్యయంతో  బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో ఈ బస్సును రూపొందించనున్నారు.

ఈ బస్సు కొనుగోలు బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మూడు కాన్వాయ్‌లలో 35 వాహనాలున్నాయి. దీనికోసం రూ.పది కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. ఒక కాన్వాయ్ హైదరాబాద్‌లోను, మరో కాన్వాయ్ విజయవాడలోను, ఇంకో కాన్వాయ్ తిరుపతిలోను అందుబాటులో ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement