ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో.. మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి.
ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో.. మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి న ష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లెలోని రెండో నెంబర్ వార్డులో గురువారం చోటుచేసుకుంది.
స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో.. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు మంటల్లో చిక్కకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.