హైకోర్టు రిజిస్ట్రార్లుగా వ్యవహరించిన పలువురు న్యాయాధికారులు ఇటీవల హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులు కావడంతో ఏర్పడిన ఖాళీలను హైకోర్టు భర్తీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు రిజిస్ట్రార్లుగా వ్యవహరించిన పలువురు న్యాయాధికారులు ఇటీవల హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులు కావడంతో ఏర్పడిన ఖాళీలను హైకోర్టు భర్తీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కె.శివప్రసాద్, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా వి.వెంకటప్రసాద్, రిజిస్ట్రార్ (ఎంక్వయిరీస్)గా జగన్నాథం, రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్)గా పి.ముత్యాలనాయుడు నియమితులయ్యారు. వీరిలో ముత్యాలనాయుడు శ్రీకాకుళం జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులు కావడంతో మంగళవారం ఆయన జిల్లా జడ్జి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రిజి స్ట్రార్ (విజిలెన్స్), రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) పోస్టులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది.