సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారయత్నం | Rape attempt on software engineer in Shamshabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారయత్నం

Jan 24 2014 8:54 AM | Updated on Jul 28 2018 8:51 PM

సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారయత్నం - Sakshi

సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారయత్నం

సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన నగర శివారులలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఆమె కారులోనే అత్యాచారయత్నం
ఒక ఘటనను మరవకముందే మరో ఘటన .. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఆమె కారులోనే గుర్తు తెలియని యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. హిమాయత్‌సాగర్‌కు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగిని, ఉదయం ఖాజగూడలోని గుడికి వెళ్లారు. అయితే కారు తాళం వేయడం మరిచిపోయారు. దర్శనం ముగించుకుని కారు డోర్ తీసేసరికి అప్పటికే వెనక సీట్లో ఒక యువకుడు ఉన్నాడు. వెంటనే ఆమె డోర్ మూసేందుకు యత్నించగా, కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఆమె కార్లోకి ఎక్కింది.

అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కారు పోనివ్వాలని బెదిరించాడు. గచ్చిబౌలి - శంషాబాద్‌ రహదారిలో ముందు సీట్లోకి వచ్చాడు. బాధితురాలు కారు నడుపుతున్న సమయంలోనే స్నేహితురాలికి హెల్ప్‌ అన్న మెసేజ్ పంపడంతో, ఆమె పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు .. పెట్రోలింగ్ వాహనాలను అలర్ట్ చేశారు. బాధితురాలి ఫోన్ ఆన్‌లోనే ఉండడంతో, ఆ సిగ్నల్స్ ఆధారంగా ... కారు రూట్‌ను గమనించారు. దుండగుడి ఆదేశాలతో హిమాయత్‌ సాగర్‌ రోడ్డుపై బాధితురాలు తన కారును పార్క్‌ చేసింది.

పోలీసులు వెళ్లి చూడగా .. అప్పటికే నిందితుడు మార్గమధ్యంలో దిగిపోయినట్టు తెలుస్తోంది. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడిని రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై పోలీసులు పెదవి విప్పటం లేదు. విచారణ కొనసాగుతున్నందున వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుడు ...బాధితురాలికి తెలిసిన వ్యక్తా....లేక ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement