వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు బుధవారం చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగారు.
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు బుధవారం చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన దిగారు. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం..చౌటుప్పల్‌కు చెందిన చిలుకని శ ంకర్ భార్య సంధ్య(20) తొమ్మిది నెలల క్రితం గర్భం దాల్చింది. అప్ప టి నుంచి చౌటుప్పల్‌లోని ఓ నర్సింగ్‌హోంలో వైద్యం చేయించుకుం టోంది. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లింది. వైద్యురాలు ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పి, సంధ్యకు రోజు రెండుచొప్పున గ్లూకోజ్ బాటిళ్లను ఎక్కిస్తోంది. మంగళవారం కూడా వెళ్లి, రెండు గ్లూకోజ్ బాటిళ్లను ఎక్కించుకొని, సాయంత్రం 5గంటలకు ఇంటికి వచ్చింది. రాత్రి 8.30గంటల సమయంలో వాంతులు కావడంతో, ఆమె అత్త ఆస్పత్రి వద్దకు వెళ్లి, డాక్టర్‌ను సంప్రదించింది. అందుకు డాక్టర్ రెండు మాత్రలు ఇచ్చి, ఇంటికి వెళ్లి, సంధ్య నాలుక కింద పెడితే, వాంతులు తగ్గిపోతాయని చెప్పింది. ఆమె వచ్చి, అలాగే చేసింది.
అయినా తగ్గలేదు. పైగా సంధ్య బాగా ఆయాస పడింది. రాత్రి 2గంటల సమయంలో ఆమె, బాత్‌రూం వెళ్లగా, గర్భం పడిపోయింది. తీవ్ర రక్తస్రావ మైంది. దీంతో ఆమె మావయ్య ఆస్పత్రికి వ చ్చి, డాక్టర్‌ను సంప్రదించగా, ఆమె నర్స్ ను ఇంటికి పంపింది. నర్స్ వచ్చి చూసి, తీవ్ర రక్తస్రావం అవుతోందని, శిశువు చనిపోయిందని, పేగు కట్ చేయలేదని ఫోన్‌లో డాక్టర్‌కు చెప్పింది. ఫోన్‌లోనే డాక్టర్ సూచనల మేరకు నర్స్ పేగును కట్ చేసింది. అయినా రక్తస్రావం ఆగకపోవడంతో, అదే రాత్రి ఆటో లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయినా డాక్టర్ ఇంటిపైనే ఉండి, కిందకు రాలేదు. నర్స్‌కు చెప్పి, ఫోన్‌లోనే వైద్యం చేసింది. గ్లూకోజ్ పెట్టించింది. తెల్లవారుజామున 5గంటల సమయంలో కిందకు వచ్చి చూసే సరికి, అప్పటికే సంధ్య స్పృహ కోల్పోయింది. పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటి కే సంధ్య మృతి చెందిందని వైద్యులు తెలపడంతో వెనుదిరి గారు. మృతదేహాన్ని తెచ్చి ఆస్పత్రి ఎదుట వేసి, బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సంధ్య మృతికి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. డాక్టర్‌తో వాగ్వా దానికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి ఆందోళన విరమింపజేశారు.
చిన్నతనంలో తండ్రి మృతి
మృతురాలు సంధ్యది చిన్నకొండూరు గ్రామం .ఈమె చిన్నతనంలోనే తండ్రి ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. అప్పటి నుంచి సంధ్య, చౌటుప్పల్‌లోని మేనత్త వద్ద ఉంటోంది. ఈమె కు సంతానం కలుగలేదు. దీంతో ఓ బాలుడిని దత్తత తెచ్చుకొని, సాదుకుంటున్నారు. బాలుడితో పాటు, సంధ్యను పెంచి పెద్ద చేశారు. చివరకు వీరిద్దరికే పెళ్లి చేశారు. చిన్నప్పటి నుం చి సంధ్య మేనత్త, మేనమామలను అమ్మనాన్న అని పిలుస్తోంది.