‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే! | prakasam district engineer will be safe | Sakshi
Sakshi News home page

‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే!

Jun 23 2014 1:04 AM | Updated on Sep 2 2017 9:13 AM

‘ప్రకాశం’ ఇంజనీర్  క్షేమమే!

‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే!

అస్సాంలో అపహరణకు గురైన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు సురక్షితంగా ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ పీ ప్రమోద్‌కుమార్ ఆదివారం వెల్లడించారు.

కంపెనీ మేనేజర్‌తో మాట్లాడించిన కిడ్నాపర్లు

ఒంగోలు/హైదరాబాద్: అస్సాంలో అపహరణకు గురైన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు సురక్షితంగా ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ పీ ప్రమోద్‌కుమార్ ఆదివారం వెల్లడించారు. తాను ఈ విషయంపై అస్సాంలోని డిమా హసావొ జిల్లా ఎస్పీ వేదాంత ఎం రాజ్‌ఖోవాతో మాట్లాడానన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగమల్లేశ్వరరావు చేత కిడ్నాపర్లు ఫోన్‌లో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణతో మాట్లాడించారని ఎస్పీ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని ఇంజనీర్ ఆయనతో చెప్పారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement