నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌ | Polling kick started for Nandyal Bypoll | Sakshi
Sakshi News home page

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌

Aug 23 2017 7:10 AM | Updated on Sep 17 2018 6:08 PM

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌ - Sakshi

నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్‌

జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.

కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. 2,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 255 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నారు.

40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కల్పిస్తున్నారు. ఆరున్నర గంటల ప్రాంతం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement