శనివారం అలంపూర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలవడాన్ని టీడీపీ, సీపీఎం నాయకులు తప్పుబట్టారు.
అలంపూర్, న్యూస్‌లైన్: శనివారం అలంపూర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలవడాన్ని టీడీపీ, సీపీఎం నాయకులు తప్పుబట్టారు.
దీంతో కార్యక్రమం రసాభాసగా మారిం ది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నేతలు ఆంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని కళాశాల గేటు వద్ద అడ్డుకున్నారు. తాము కేవలం పార్టీ తరఫున స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిప్రతం మాత్రమే అందించి వెళ్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. సీపీఎం నాయకులు సైతం వారికి మద్దతు తెలుపుతూ వినతిపత్రం అందజేయడానికి అనుమతించాలని కోరారు.
కానీ పోలీసులు ససేమిరా అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తహశీల్దార్ అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రజాసమస్యలను ప్రస్తావించడానికి వచ్చిన తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిం చారు. రచ్చబండ ఎందుకు కోసం పెట్టారని నిలదీశారు. చివరికి నలుగురు మాత్రమే రావాలని తహశీల్దార్ సూచించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో 13 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమం అనంతరం విడిచిపెట్టారు. అరెస్ట్‌ను నిరసిస్తూ పట్టణంలోని గాంధీచౌక్‌లో టీడీపీ, సీపీఎం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.