మావోయిస్టుల పేరు చెప్పి తీసుకెళ్లారు...

Police Arrest Tribals in Visakhapatnam - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను విడిచిపెట్టాలి

ముంచంగిపుట్టు  పోలీసు స్టేషన్‌కు వచ్చి వేడుకొన్న  

బూరుగుపల్లి గ్రామస్తులు

విశాఖపట్నం, ముంచంగిపుట్టు (పెదబయలు): మావోయిస్టులు రమ్మంటున్నారని చెప్పి తమ గ్రామానికి చెందిన ఇద్దర్ని పోలీసులు అన్యాయంగా తీసుకెళ్లారని వారిని వెంటనే విడిచిపెట్టాలని మండలంలోని బుంగాపుట్టు పంచాయతీ బూరుగుపల్లి గ్రామస్తులు కోరారు. వారు బుధవారం ముంచంగిపుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి వేడుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం  రాత్రి బూరుగుపల్లి గ్రామానికి వచ్చిన పోలీసులు కిల్లో సురేష్‌ (సను), గొల్లోరు సాధూరామ్‌( సాదు) అనే  ఇద్దర్ని అదుపులోని తీసుకున్నారని తెలిపారు.  మావోయిస్టులకు చెందిన సుధీర్‌ అనే వ్యక్తి రమ్మన్నాడని చెప్పి అమాయకులైన తమ వా రిని పోలీసులు తీసుకుపోయారని సురేష్‌ తల్లిదండ్రులు సోమనాథ్,రక్నాలు కన్నీరుమున్నీరయ్యా రు. సాధూరామ్‌ భార్య దోయిమెత్తి గర్భిణి, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్తకు బయట వ్యక్తులతో సంబంధం లేదని, పేదరికంలో ఉన్న తమను పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం తగదని ఆమె వాపోయింది.

రాత్రి అందరూ నిద్రి స్తున్న సమయంలో పోలీసులు గ్రామంలో ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేసి, మావోయిస్టుల పేరు చెప్పి ఇద్దర్ని ఎత్తుకుపోయారని వారిని విడిచిపెట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మా గ్రామానికి అతిథులు   ఎవరు వచ్చినా ఆదరిస్తామని, మావోయిస్టులు వచ్చినా భోజనం పెట్ట మంటే వంట చేసి  పెడతామని, అందకు మమ్మల్ని నేరస్తులుగా  చిత్రీకరించడం తగదని గ్రామస్తులు వాపోయారు. సురేష్,సాధూరామ్‌లు ముం చంగిపుట్టు స్టేషన్‌లో ఉన్నట్టు కొంతసేపు, రూడకోట అవుట్‌ పోస్టులో ఉన్నట్టు మరికొంత సేపు  చెప్పి మభ్యపెడుతున్నారని, వారిని విడిచిపెట్టాలని  కోరారు. స్థానిక ఎస్‌ఐ అరుణ్‌ కిరణ్‌ను వివరణ కోరగా గ్రేహౌండ్స్‌ దళాలు, ప్రత్యేక పోలీసు  బృందాలు  ఏవోబీలో గాలింపులు చేపడుతున్నాయని, గిరిజనులను కూబింగ్‌ పార్టీలు అదుపులోకి తీసుకుని ఉండ వచ్చని, తమకు ఏ సమాచారం లేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top