రేషన్‌కార్డులకు రెక్కలు | Passwords private arm of the government | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులకు రెక్కలు

Oct 22 2013 6:51 AM | Updated on Sep 1 2017 11:52 PM

జిల్లాలో రేషన్‌కార్డులకు రెక్కలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తరుచూ మాయమవుతున్నాయి. దీంతో లబ్ధిదారులకు సరుకులు అం దక, ఇతరత్రా విధాలుగా నష్టపోతున్నా రు.

 జిల్లాలో రేషన్‌కార్డులకు రెక్కలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తరుచూ  మాయమవుతున్నాయి. దీంతో లబ్ధిదారులకు సరుకులు అం దక, ఇతరత్రా విధాలుగా నష్టపోతున్నా రు. రెవెన్యూ అధికారుల సాయంతో రేషన్‌షాప్‌ల డీలర్లు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ తతంగం నడుపుతున్నట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కీలకమైన రెవెన్యూ ఆన్‌లైన్ పాస్‌వర్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లి ‘రేషన్’ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అలాగే తెల్లరేషన్ కార్డును ఏఏవై కార్డులుగా, గులాబీ రేషన్‌కార్డులను తెల్లరేషన్ కార్డులకు మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై విచారణ చేపడితే బోగస్ రేషన్‌కార్డులు, అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
 
 బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఆన్‌లైన్‌లో రేషన్ కార్డులు మాయ మవుతున్నాయి. ఇటీవల తరుచూ జరుగుతున్న ఈ పరిణామాలతో కొన్నేళ్లుగా కార్డు కలిగి ఉన్న  లబ్ధిదా రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అక్ర మార్కులు లబ్ధిదారుల పేర్లను తొలగిస్తున్నారు.  ఈ చర్యలు పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

రేషన్‌కార్డులు ఆన్‌లైన్‌లో జంపింగ్ కావడం కొత్త కాదు, ప్రతి నెలా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో తమ కార్డులు సేల్స్ రిజిస్టర్‌లో లేవని, డీలర్లు సరుకులు ఇవ్వడం లేదంటూ పలువురు లబ్ధిదారులు అధికారులకు మొర పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఒక్క బాన్సువాడ మండలంలోనే సుమారు 500 రేషన్‌కార్డులు ఆన్‌లైన్ నుంచి గల్లంతయ్యాయి. బాన్సువాడ పట్టణానికి చెందిన ఓ లబ్ధిదారుడి రేషన్‌కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ 1827005బి0107 కాగా, ఇతని కార్డును ఆన్‌లైన్ నుం చి తొలగించి మరోవ్యక్తికి అప్పగించారు. దీంతో సదరు వ్యక్తి లబోదిబోమంటున్నాడు.

 పట్టించుకునే వారేరీ..

 ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులను తొలగించి, వాటి స్థానం లో ఇతరులకు రేషన్‌కార్డులు జారీచేయడంలాంటి ఘటనలపై లబ్ధిదారులు పలుమార్లు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా, ఆందోళనలు చేసినా పట్టించుకున్న వారు లేరు. కొన్నేళ్ల నుంచి నెల క్రితం వరకూ సరుకులు ఇస్తున్న తమరేషన్‌కార్డులను తొలగించడం అ న్యాయమంటూ బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. జిల్లా కలెక్టర్‌కు సైతం అర్జీలు సమర్పించినా  పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
 
ఎన్నో అక్రమాలు...

 ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులు మాయం కావడం, కీ రిజిస్టర్‌లో పేర్ల తొలగింపు,సేల్స్ రిజిస్టర్‌లో లేనివి ఉన్నట్లుగా నమోదు కావడం వంటి ఎన్నో అవకతవకలు జరుగుతున్నా... అధికారు లు నిర్లక్ష్యంగా ఆన్‌లైన్‌లో సాంకేతిక లోపా లంటూ చెప్పడం పరిపాటిగా మారింది. సందట్లో సడేమియాలా పౌరసరఫరాలకు శాఖకు సంబంధించిన ప్రభుత్వ పాస్‌వర్డులను తెలుసుకున్న కొందరు, కాసులకు కక్కుర్తిపడి పేదలకు అన్యాయం చేస్తున్నా రు.

ఈ వ్యవహరంలో డీలర్లు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై అవగాహన ఉన్న వ్యక్తులను లోబర్చుకుని తెల్లకార్డులను ఏఏవై కార్డులుగా, బోగస్ కార్డులను సృష్టించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిలో ఏఏైవె  కార్డులు, రచ్చబండ కార్డులు, డబ్ల్యూఏపీ కార్డు లు ఉన్నా యి. ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డులను మాయం చేస్తున్నది ఎవరు? దీనివల్ల లబ్ధిపొందుతున్నదెవరు? ప్రభుత్వ పాస్‌వర్డులను దొంగతనంగా వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడతున్న వారెవరు? అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  రచ్చబండలో మంజూరైన కార్డులకు రేషన్ సరుకులు ఇవ్వడంలో డీలర్లు ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement