పాపికొండల బోట్ యాత్రకు బ్రేక్ | Papikondalu boat journey temporarily suspended | Sakshi
Sakshi News home page

పాపికొండల బోట్ యాత్రకు బ్రేక్

May 21 2015 8:53 AM | Updated on Apr 3 2019 5:24 PM

పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ బోట్లను నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం నుంచి దృఢత్వ పరీక్షల నిమిత్తం నిలిపివేశారు.

రాజమండ్రి(తూర్పుగోదావరి): పాపికొండల పర్యటనకు వెళ్లే లగ్జరీ బోట్లను నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం నుంచి దృఢత్వ పరీక్షల నిమిత్తం నిలిపివేశారు. ముందుగా ఈ విషయం తెలియక రిజర్వేషన్ చేయించుకున్న వివిధ ప్రాంతాల పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. లెసైన్సులు రెన్యువల్ చేసేందుకు బోట్లను తనిఖీ చేయగా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు తమ సిబ్బంది గుర్తించారని దీంతో వాటిని నిలిపివేశామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

వీటిని సరి చేయటానికి నాలుగు రోజుల వరకు సమయం పడుతుందని అంటున్నారు. బోటు యజమానులు వాటిని త్వరగా పూర్తి చేస్తే వెంటనే రెన్యువల్ చేస్తామని వారు పేర్కొంటున్నారు. దీంతో మరో నాలుగు రోజులపాటు పాపికొండల లగ్జరీ బోట్ యాత్రకు అంతరాయం తప్పదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement