జాతీయరహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో బోల్తా : ఒకరి మృతి
Aug 28 2013 5:50 AM | Updated on Aug 30 2018 3:56 PM
దత్తిరాజేరు,న్యూస్‌లైన్: జాతీయరహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గజపతినగరం నుంచి రామభద్రపురం జాతీయ రహదారిపై ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం వెళ్తున్న ఆటో దత్తిరాజేరు మండలం మరడాం వద్ద బోల్తా కొట్టి తుప్పల్లో పడిపోయింది. ప్రయాణికుల్లో బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన పైల పైడియ్య(60) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
పైల మీరయ్య(ము గడ),పైల బుగతమ్మ(ముగడ)అరసవిల్లి సునీత(బొడ్డవరం),పారాది సాంబ మూర్తి (కొత్తబగ్గాం) తనుకుసూర్యానారాయణ(వైజాగ్), యజ్జల రాంబాబు(ఆరికతోట)ఆటో డ్రైవర్ రాచర్ల రమణ(కొత్త వెలగాడ) ప్రమాదంలో గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో గజపతినగరం,విజయనగరం ప్రభుత్వాస్పత్రులకు ఎస్ బూర్జివలస పోలీసులు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన పైడయ్యకు అనారోగ్యం సోకడంతో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు వైద్యం కోసం తీసుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈసంఘటనతో కుటుంబ సభ్యులు భోరున విల పిస్తున్నారు. ఎస్.బూర్జివలస ఎస్‌ఐ డి శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement