కేసీఆర్ కు థాంక్స్ అవసరం లేదు:కోదండరామ్ | no need thanks to kcr, says kodandaram | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కు థాంక్స్ అవసరం లేదు:కోదండరామ్

Feb 18 2014 4:26 PM | Updated on Jul 29 2019 2:51 PM

కేసీఆర్ కు థాంక్స్ అవసరం లేదు:కోదండరామ్ - Sakshi

కేసీఆర్ కు థాంక్స్ అవసరం లేదు:కోదండరామ్

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని టి..జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని టి..జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలిపారు. కేసీఆర్ తమలో భాగమైనందున కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించిన కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకత్వాలకు కోదండరామ్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రంగా నిలుపుతామని కోదండరామ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement