ఇక ఏపీ, తెలంగాణ, కొమురం భీమ్ ఎక్స్ప్రెస్లు | new train service willbe started soon namig it as AP express says venkayya | Sakshi
Sakshi News home page

ఇక ఏపీ, తెలంగాణ, కొమురం భీమ్ ఎక్స్ప్రెస్లు

Apr 9 2015 8:09 PM | Updated on Sep 3 2017 12:05 AM

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే కొత్త సర్వీసును ఏపీ ఎక్స్ప్రెస్గా పరిగణించాలని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సర్వీసును తెలంగాణ ఎక్స్ప్రెస్గా వ్యవహరించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

ఇకనుంచి రెండు తెలుగు రాష్ట్రాలనుంచి దేశరాజధాని ఢిల్లీకి వేర్వేరుగా సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే కొత్త సర్వీసును ఏపీ ఎక్స్ప్రెస్గా పరిగణించాలని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సర్వీసును తెలంగాణ ఎక్స్ప్రెస్గా వ్యవహరించాలన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించిన వెంకయ్య.. ఈ మేరకు నిర్ణయాలను వెలువరించారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలుకు ప్రస్తుత పేరు (తెలంగాణ ఎక్స్ప్రెస్) ను తొలిగించి కొమరం భీం ఎక్స్ప్రెస్గా నామకరణం చేశామన్నారు. విశాఖకు కొత్తరైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరినట్లు తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వివరించారు. హుద్హుద్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న వైజాగ్ ఎయిర్పోర్టు మరమ్మతులు ఈనెల చివరినాటికి పూర్తవుతాయన్నారు.

Advertisement

పోల్

Advertisement